ఇసుక ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు..

ఇసుక ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు..
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం నిడిగొండ వాగు నుండి ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున నిడిగొండ గ్రామానికి చెందిన ట్రాక్టర్ ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తుండగా సీజ్ చేసి, తూడి శ్రీకాంత్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి. నరేష్ తెలిపారు. అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలియచేశారు.
