అన్నదాతల సెల్యూట్..

అన్నదాతల సెల్యూట్..
ములుగు జిల్లా, మంగపేట, ( ఆంధ్రప్రభ ) :
వందేమాతరం గేయం రచించి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని, నవంబర్ 7న ఉదయం10 గంటలకు దేశ ప్రజలంతా ఒక నిర్ణీత సమయంలో వందేమాతర గేయం ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురానికి చెందిన రైతులు తమ దేశభక్తిని చాటుకున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను (ధాన్యాన్ని) ఆర బెట్టిన కళ్ళాన్నే తమ దేశ భక్తి చాటుకునేందుకు వేదికగా మార్చుకున్నారు. కళ్ళంలోనే నిలబడి వందేమాతరం గీతం ఆలపించి దేశభక్తిని చాటారు. ఈ కార్యక్రమంలో రైతులు ఎల్లంకి రాజేష్ ( డీజే.రాజేష్ ), గూడెల్లి సత్యం, గడ్డం శ్రీను, పాటిబండ్ల హనుమంతరావు, బత్తుల శోభన్ తదితరులు పాల్గొన్నారు.
