1. దైవస్మరణ: ప్రతి రోజు ఉదయం లేదా పరీక్షకు వెళ్ళే ముందు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి అలాగే, తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసి వెళ్ళండి. ఇది మనస్సును స్థిరంగా ఉంచి, భయాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. ”సరస్వతీ నమస్తుభ్యం” లాంటి విద్యా దేవత మంత్రాన్ని పఠించండి. ఇది జ్ఞాపకశక్తిని మెరుగుపరచేందుకు సహాయపడుతుంది.
2. ప్రాణాయామం మరియు ధ్యానం: ప్రతి రోజు ఉదయం కనీసం 5-10 నిమిషాలు ప్రాణాయామం మరియు ధ్యానం చేయండి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.
3. సానుకూల ఆలోచనలు: ”నేను నా పరీక్షను విజయవంతంగా రాయగలను” అనే ధైర్యాన్ని కలిగి ఉండండి. విశ్వాసం విజయానికి కీలకం.
4. సాధారణ జీవనశైలి: పరిక్షా సమయంలో శరీరానికి శుద్ధమైన ఆహారము, తగినంత నిద్ర ఎంతో అవసరం.
ప్రశ్నపత్రం పూర్తిగా చదవండి: మొదట ప్రశ్నలను శ్రద్ధగా చదివి, ఏ ప్రశ్నలకు ముందుగా సమాధానం రాయాలో నిర్ణయించండి.
మనం రాసిన జవాబులో చక్కటి చేతివ్రాతతో ఎక్కువగా కొట్టివేతలు లేకుండా ఉంటే పరీక్షాధికారి సులభంగా చదవగలిగితే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది.
చివరగా సమీక్షించుకోండి: సమయం ఉంటే చివరిలో సమాధానాలను మరోసారి పరిశీలించి, తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి.
ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి, మీరు తప్పక విజయం సాధిస్తారు!
ప్రత్యేక సూచనలు
– ఫోన్‌కి టీవీకి దూరంగా ఉండండి.
– వాట్సాప్ ఫేస్బుక్ సోషల్ మీడియాని పరీక్ష కాలంలో పూర్తిగా ఆపేయండి.
– అనవసరమైన విషయాలు చర్చకి రానివ్వకండి.
– పరీక్ష తర్వాత నేరుగా ఇంటికి వెళ్లి ఒక గంట సేపు రెస్ట్ తీసుకోండి.
– పరీక్షాసమయంలో అనుకూలమైన దుస్తులు ధరించండి.
– ఎక్కువ శాతం పొద్దున్నే చదవడం మంచిది.
– నిత్యము సబ్జెక్టు గురించి ఆలోచన చేస్తూ ఉండండి.
– పెన్స్ హాల్ టికెట్ జామెంట్రీ బాక్స్ ప్రతి ఒక్కటి కూడా ముందు రోజే సర్దుకొని ఉంచవలెను.
సరస్వతి కటాక్షం ఎల్లవేళలా మీతోడు ఉండాలని కోరుకుంటూ…తిరుమాని చంద్రశేఖర్
పరీక్షా సమయంలో పాటించవలసిన నియమాలు
