
Rule 94C | స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం
Rule 94C | స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం
Rule 94C | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి విపక్షాలు నోటీసు ఇచ్చాయి. ఈ మేరకు లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ ఎంపీలు కె.సురేశ్, మహమ్మద్ జావెద్ నోటీసు అందజేశారు. రూల్ 94సీ కింద నోటీసు ఇచ్చామని ఎంపీ గౌరవ్ గొగోయ్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం నోటీసుపై 118 మంది ఎంపీలు సంతకాలు చేశారు.
అయితే లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానంపై విపక్షాల్లో చీలిక ఏర్పడింది. తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చేందుకు టీఎంసీ నిరాకరించింది. అయితే కాంగ్రెస్ ఇప్పటికే వందమందికి పైగా ఎంపీల సంతకాలను సేకరించింది. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
