హస్త కళాకారులకు మెరుగైన అవకాశాలు

హస్త కళాకారులకు మెరుగైన అవకాశాలు
- జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి హస్త కళాకారులకు మెరుగైన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. కొండపల్లి ఖిల్లా రోడ్డులోని ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబుతో కలిసి కలెక్టర్ సోమవారం పరిశీలించారు. కళాకారులు తయారు చేస్తున్న బొమ్మల నాణ్యత, పనితీరు, ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో జరుగుతున్న కార్యక్రమాల అమలు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
ఆర్టీఐహెచ్ ఆధ్వర్యంలో కళాకారులు చేస్తున్న కొండపల్లి బొమ్మల తయారీ విధానాన్ని కలెక్టర్ దగ్గరగా పరిశీలించారు. ఎక్స్ పీరియన్స్ సెంటర్ లో జరుగుతున్న కార్యక్రమాలను మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు కలెక్టర్ కు వివరించారు. కార్యక్రమంలో అధికారులు, కళాకారులు, స్థానికులు పాల్గొన్నారు.
