రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ పాషా మృతి..

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ పాషా మృతి..

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : పట్టణ కేంద్రానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ షేక్ యాకూబ్ పాషా విధులు నిర్వహించుకునీ డిపో నుండి ఇంటికి వెళుతున్న క్రమంలో స్థానిక రామకృష్ణ థియేటర్ సమీపంలోని డివైడర్ వద్ద ఆదివారం రాత్రి సుమారు 11:30 ప్రాంతంలో స్కూటీ ఢీ కొట్టింది. అత్యవసర చికిత్స కొరకు ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాగా అప్పటికే మృతి చెందడం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. స్కూటీ పై వెళ్తున్న వ్యక్తి కూడా మృతి చెందినట్లు సమాచారం. అయితే.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply