RTC Bus | బస్సు ప్రమాదం.. 12 మందికి గాయాలు..

RTC Bus | బస్సు ప్రమాదం.. 12 మందికి గాయాలు..

కెరమేరి మండలంలో ఘటన..!


RTC Bus | ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ : ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లా (Asifabad Komaram Bhim District) కెరమెరి మండలం పరందోలి ఘాట్ లో ఆర్టీసీ బస్సు (RTC Bus) ప్రమాదానికి గురైంది. 12మందికి గాయాలయ్యాయి. ఈ రోజు ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు పరందోలికి వెళ్తుండగా ఉదయం 9 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. ఘాట్ ఏరియాలో బ్రేకులు ఫెయిల్ (Brakes fail) కావడం వల్లే ఆర్టీసీ బస్సు పత్తి పంట చేనులోకి దూసుకెళ్లినట్టు ప్రయాణికులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో మొత్తం 38మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడ్డ 12 మంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply