Rs. crore | రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం…

Rs. crore | రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం…
- జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి
Rs. crore | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : నీతి ఆయోగ్ ద్వారా యాస్పిరేషనల్ బ్లాక్గా ఎంపికై అవార్డు సాధించిన మద్దికెర మండలంలో రూ.కోటి విలువైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు నీతి ఆయోగ్ నుంచి ఆమోదం లభించిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. ఈ రోజు ఢిల్లీ నుంచి నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… మద్దికెర మండలంలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు, హెల్త్ క్లినిక్స్, ఆర్వో ప్లాంట్లు, ఫిల్టర్ బెడ్స్, మినీ ట్యాంకులు తదితర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.కోటి వ్యయంతో ప్రతిపాదనలు పంపించగా వాటిని నీతి ఆయోగ్ అధికారులు ఆమోదించినట్లు పేర్కొన్నారు. చిప్పగిరి మండలంలో రూ.1.50 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా నీతి ఆయోగ్ ఆమోదం లభించిందని కలెక్టర్ తెలిపారు.
ఈ రెండు మండలాల్లో అభివృద్ధి పనులను వేగవంతంగా ప్రారంభించి ప్రజలకు మేలు చేకూర్చేలా తగిన చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, సీపీఓ భారతి, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి విజయ, డీఎం అండ్ హెచ్‌వో భాస్కర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మనోహర్, జిల్లా ఆస్పిరేషనల్ బ్లాక్స్ కోఆర్డినేటర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
