Rs. 33,000 crore | ఏడాదికి రూ.33 వేల కోట్లు

Rs. 33,000 crore | ఏడాదికి రూ.33 వేల కోట్లు

  • ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ: యార్లగడ్డ

Rs. 33,000 crore | గన్నవరం, ఆంధ్ర‌ప్ర‌భ‌ : రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ప్రతినెలా రూ. 2,700 కోట్లు చొప్పున ఏడాదికి రూ.33,000 కోట్లు(Rs. 33,000 crore) అందజేస్తున్నట్లు ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ తెలిపారు. గన్నవరం మండలం బూతుమిల్లిపాడు గ్రామంలో ఈరోజు ఉదయం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు(Chief Minister Chandrababu Naidu)కు దక్కుతుందన్నారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు విశాఖపట్నంను ఐటీ హాబ్ గా తీర్చి దిద్దుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్న మంత్రి లోకేష్ నిరుద్యోగులకు ఐటీ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పెద్ద ఎత్తున ఐటీ సంస్థలను తీసుకొస్తున్నారని గుర్తు చేశారు.

కార్యక్రమంలో గన్నవరం వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ(Market Yard Committee) చైర్మన్ గూడవల్లి నరసింహారావు, చిరుమామిళ్ల సూర్యం, గన్నవరం మండల టిడిపి అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్, బూతిమిల్లిపాడు గ్రామ టిడిపి అధ్యక్షులు సవలం దినేష్, ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు, మూల్పూరి సాయి కళ్యాణి, బోడపాటి రవి, గుజ్జర్లపూడి బాబురావు, మేడేపల్లి రమ, బుస్సే నాగప్రసాద్ యనమదల సతీష్, పాలడుగు నాని, అన్నే హరికృష్ణ, పండేటి చిరంజీవి, గొంది నరేంద్ర, జనసేన పార్టీ నాయకులు చిమట రవివర్మ, పచ్చిపాల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply