Rs.2,50,000/- LOC | మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందజేత

Rs.2,50,000/- LOC | మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందజేత
Rs.2,50,000/- LOC | మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన నడిపల్లి శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని సంప్రదించగా సిఎం సహాయ నిధి నుండి రూ.2,50,000/- ఎల్ఓసి(Rs.2,50,000/- LOC)ని మంజూరు చేయించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(MLA (Komatireddy Rajagopal Reddy) సౌజన్యంతో మంజూరైన ఎల్ ఓసి(LOC)ని ఈ రోజు పట్టణ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ కి అందజేశారు.
అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ తమకి సహాయం చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎల్లవేళల రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
