Rs. 25 lakhs | సీసీ రోడ్లకు శంకుస్థాపన

Rs. 25 lakhs | సీసీ రోడ్లకు శంకుస్థాపన
- కందుకూరు గ్రామానికి రూ. 25 లక్షల సీసీ రోడ్లు
Rs. 25 lakhs | వేంసూరు, ఆంధ్రప్రభ : కందుకూరు గ్రామంలో సీసీ రోడ్లు నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు విడుదల అయ్యాయి. గ్రామంలో ఐదు అంతర్గత రహదారులను సీసీ రోడ్లు నిర్మాణానికి ఈ నిధులు ఉపయోగించ నున్నారు. మంగళవారం సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ గొర్ల ప్రభాకరరెడ్డి, వార్డు సభ్యులు కలసి పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో పిఆర్ ఏఇ సాయికృష్ణ, కార్యదర్శి సునీత, వార్డు సభ్యులు బూరుగు కృప, కిస్టా కొండ,విస్సంపల్లి ఏసు, తుంగా సుధాకర్, బూరుగు పద్మ, నడ్డి కృష్ణమ్మ, మర్సకట్ల నాగమణి ఏసేబు, నాయకులు రాయల సత్యనారాయణ, బండి ఉపేంద్రరెడ్డి, వరెడ్డీ మురళి తోపాటు పలువురు పాల్గొన్నారు.
