Rs. 15 lakh | అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ అందజేత…

Rs. 15 lakh | అభివృద్ధి పనులకు ప్రొసీడింగ్స్ అందజేత…
Rs. 15 lakh | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.15 లక్షల(Rs. 15 lakh) రూపాయలు మంజూరు చేయడం జరిగిందని ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ తెలిపారు. గోన్ గొప్పుల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రహరీ నిర్మాణం కొరకు రూ 10 లక్షలు, బాబాపూర్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ నిర్మాణం కొరకు రూ. 5 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని అన్నారు.
ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం(MGNREGS scheme) ద్వారా రూ 15 లక్షలు మంజూరు అయినట్టు ఎంపీడీఓ చెప్పారు. మంజూరైన నిధులతో ప్రహరీ ల నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. మంజూరైన నిధుల ప్రొసీడింగ్ పత్రాలను ఆయా గ్రామాల సర్పంచ్ లు చేపూరి చరణ్ గౌడ్, అమీర్ లకు అందజేశారు. ఈ కార్యక్రమం లో ఉపాధి హామీ ఏపీవో నర్సయ్య, ఎంపీడీఓ స్టాఫ్ ఉన్నారు.
