Rs.12 crores | ఢిల్లీలో డ్రగ్స్ గుట్టు ర‌ట్టు…

Rs.12 crores | ఢిల్లీలో డ్రగ్స్ గుట్టు ర‌ట్టు…

  • విదేశీయుల అరెస్టు : రూ.12 కోట్ల విలువైన డ్ర‌గ్స్ స్వాధీనం

Rs.12 crores | ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్స్ మాఫియా(Drug mafia)ను అడ్డుకుని ప్రధాన నిందితుడు సహా అనేక మంది విదేశీయులను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో తెలంగాణ పోలీస్, ఢిల్లీ పోలీసుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఢిల్లీ జాయింట్ సీపీ మాట్లాడారు. డ్రగ్స్ సరాఫరా చేస్తున్న బ్యాచ్‌లో మొత్తం ప‌ది మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. తెలంగాణ ఈగిల్ టీం ఏడు గురిని అరెస్ట్ చేయడం జరిగిందని, డ్రగ్స్ సరఫరాలో మాస్టర్ మైండ్ అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా తెలంగాణకు డ్రగ్స్ సరఫరా జరుగుతుంద‌ని, రూ.12 కోట్ల(Rs.12 crores) విలువైన డ్రగ్స్ పట్టుకున్నామని చెప్పారు.

తెలంగాణ ఎస్పీ సీతారాం మీడియా మాట్లాడారు. తెలంగాణలో ఒక రెస్టారెంట్లో డ్రగ్స్ వాడకం గుర్తించామని చెప్పారు. వాళ్లకు కొరియర్లో డ్రగ్స్ వస్తున్నాయని, నైజీరియన్లు ఇందులో ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెట్వర్క్ లో ఎవరెవరు ఉన్నారో గుర్తించిన‌ట్లు చెప్పారు. దీనిలో భాగంగానే ఢిల్లీలో రెక్కీ నిర్వహించి, ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్(Delhi Crime Branch)తో కలిసి ప్లాన్ చేశామన్నారు.

ఢిల్లీ పోలీసులు సైతం సహకరించాలని చెప్పారు. ఈ క్రమంలోనే 105 తెలంగాణ, ఢిల్లీ 80 మంది పోలీసులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారని, 100 శాతం ఆపరేషన్ సక్సెస్(operation success) అయిందని, నిందితులు ప్రతి రోజు 1975 మందికి తెలంగాణలో డ్రగ్స్ సప్లై చేస్తున్నారని వెల్లడించారు.

Leave a Reply