ఆడబిడ్డ పెళ్లికి చేయూత..

ఆడబిడ్డ పెళ్లికి చేయూత..

సర్పంచ్ గున్నెళ్ళ శ్రీనునివాసులు

వెల్దండ, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని రాచూర్ గ్రామ సర్పంచ్ గున్నెల శ్రీనివాస్ ఎన్నికలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మరోసారి ఆదర్శంగా నిలిచారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో విజయం సాధిస్తే గ్రామంలోని ప్రతి ఆడబిడ్డల పెళ్లికి రూ.10,116 రూపాయల పెళ్లికానుకను అందజేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చారు. ఈ సందర్బంగా బుధవారం రాచూర్ గ్రామానికి చెందిన దుబ్బ రాములు – సాయమ్మ దంపతుల రెండవ కుమార్తె మమతకు పెళ్లి కానుకగా 10,116 రూపాయలను వారి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు సర్పంచ్ చేసిన సేవలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆడబిడ్డల కుటుంబాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తూ, సమాజంలో మంచి సందేశాన్ని ఇస్తున్నారని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ సురేష్ రెడ్డి, గంగాధరి రమేష్,వెంకటేష్,విజేందర్,గంగాధరి శ్రీనివాస్, మదార్, వెంకోబా, అర్జున్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply