డీజిల్‌తో స్టవ్..

డీజిల్‌తో స్టవ్..

  • సిరిసిల్ల వాసి వినూత్న ప్రయోగం
  • తయారీకి రూ.10వేల వరకు ఖర్చు

సిరిసిల్ల, ఆంధ్రప్రభ : వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడంతో హోటళ్ల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అల్పాహార కేంద్రం నడుపుతున్న మహేశ్ వినూత్న ఆలోచనతో డీజిల్తో పనిచేసే స్టవ్ తయారు చేసి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాడు. చిన్నపాటి విద్యుత్తు మోటారును నడపడంతో వచ్చే గాలిని ఓ వైపు ద్వారా డీజిల్ను మరోపైపు ద్వారా పొయ్యి దగ్గరకు పంపి.. అక్కడ వెలిగించడం ద్వారా మంట వచె చాలా దీనిని రూపొందించారు.

అవసరాన్ని బట్టి మంటను హెచ్చుతగ్గులు చేసుకునే వీలు కూడా కల్పించాడు. ఒక లీటరు డీజిల్ తో గంట నుంచి రెండు గంటలు పొయ్యి మండుతుం దని మహేశ్ తెలిపారు. వాణిజ్య సిలిండర్ ధరతో పోల్చితే దీంతో ఖర్చు సగానికి తగ్గిందన్నారు. దీని తయారీకి సుమారు రూ.10 వేల ఖర్చుతోపాటు నాలుగు రోజుల పాటు శ్రవి పెంచినట్లు వెల్లడించారు. ఇది చూసిన మరో రెండు హోటళ్ల నిర్వాహకులు సైతం ఇలానే పొయ్యిలు తయారు చేయించుకోవడం విశేషం.

Leave a Reply