RR vs RCB |ఆర్ ఆర్ ను నిలువరించిన ఆర్ సి బి : బెంగళూర్ విజయ లక్ష్యం ఎంతంటే

బెంగుళూరు: : ఐపీఎల్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ నిర్ధారిత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది.ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకొని.. రాజస్థానన్ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది..

జైపూర్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దాంతో, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ప‌ప‌ర్ ప్లేలో 45 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. ఆ కాసేప‌టికే ఫామ్‌లో ఉన్న కెప్టెన్ సంజూ శాంస‌న్ (15) ఔట‌య్యాడు. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ జితేశ్ శ‌ర్మ‌కు క్యాచ్ ఇచ్చి సంజూ వెనుదిరిగాడు.

ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్ 75 పరుగులు చేసి హెజెల్ వుడ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. హెట్ మేయర్ 9 పరుగులు మాత్రమే చేసి భువి చేతికి చిక్కాడు.జురెల్ 35 , నితీష్ రాణా నాలుగు పరుగులతో నాకౌట్ గా నిలిచారు. ఆర్ సి బీ బౌలర్లలో కునాల్, భువి, హెజెల్ , యాష్ దయాళ్ లు ఒక్కో వికెట్ పడగొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *