ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఈరోజు (శనివారం) జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ – లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది.
సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలుపొందిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేపట్టనుంది.
ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడగా కేవలం రెండే మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. దీంతో రాజస్థాన్ ఖాతాలో నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో (-0.714) కొనసాగుతోంది.
మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. దీంతో ఎనిమిది పాయింట్లతో పాయింట్ల పట్టికలో లక్నో ఐదో స్థానంలో (+0.086) కొనసాగుతోంది.
హెడ్-టు-హెడ్..
ఇప్పటి వరకు ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ ఐదు సందర్భాల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లోనే లక్నో గెలిచింది.
తుది జట్ల :
లక్నో సూపర్ జెయింట్స్ : మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (కెప్టెన్-వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్, దిగ్వేష్ సింగ్ రాఠీ, శార్దూల్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్.
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, శుభమ్ దూబే, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.