శ్రీ సత్యసాయి బ్యూరో, ఆగస్టు 21 (ఆంధ్రప్రభ) : మదనపల్లి ((Madanapalle) లో రౌడీషీటర్ పవన్ కుమార్ అలియాస్ పట్ర పవన్ అరెస్ట్ అయ్యాడు. ఇటీవల సాయికిషోర్పై కిడ్నాప్, దాడి కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న అతడిని పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు.
గత రెండు రోజుల క్రితం సాయి కిషోర్ (SaiKishore) అను వ్యక్తిని చంపే ఉద్దేశంతో కిడ్నాప్, దాడి చేసి గాయపరచిన కేసు, అదే ఫిర్యాదిని ఆ కేసులో రాజీకాకపొతే చంపుతామని బెదిరించిన మరో కేసులో ప్రధాన నిందితుడు అయిన రౌడీషీటర్ పవన్ కుమార్ @ పట్ర పవన్ ను రాత్రి మదనపల్లి (Madanapalle)లో అరెస్ట్ చేసినట్లు పట్టణ సిఐ నారాయణరెడ్డి తెలిపారు.
అనంతరం కోర్టుకు హాజరు పరచగా, కోర్టు వారు రిమాండ్ (Remand) విధించడంతో ముద్దాయిని కడప సెంట్రల్ జైలు (KadapaCentralJail) కు తరలించారు. ఈ కేసులో ఇతర ప్రదాన ముద్దాయిలు అయిన శివ @ పట్ర శివ, సాయికుమార్, కళ్యాన్ @ చోరాలు పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని సీఐ వివరించారు.