Rohith Sharma | హిట్ మ్యాన్‌ ఖాతాలో అరుదైన రికార్డ్ !

హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ త‌న ఖాతాలో మ‌రో మైలు రాయిని చేరుకున్నాడు. తాజాగా జ‌రుగుతున్న 2025 18వ సీజ‌న్లో ఒక ఆల్ టైమ్ రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్. జైపూర్ వేదిక‌గా గురువారం (మే 1) రాజ‌స్థాన్ రాయ‌ల్స్ తో జరుగుతున్న‌ మ్యాచ్ లో 53 తో అర్ధ‌శ‌త‌కంలో రాణించిన రోహిత్.. ముంబై ఇండియన్స్ తరఫున (6013*) ప‌రుగులు సాధించాడు. దీంతో ఒక జ‌ట్టు త‌రుఫున అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 8871) త‌రువాత రెండోవ స్థానంలో న‌లిచాడు.

T20ల్లో ఒకే జట్టు తరపున అత్యధిక T20 పరుగులు:

విరాట్ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున – 8871 ప‌రుగులు
రోహిత్ శ‌ర్మ ముంబై ఇండియ‌న్స్ త‌రుఫున – 6013 ప‌రుగులు*
సురేష్ రైనా, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుఫున – 5529 ప‌రుగులు
ఎంఎస్ ధోని, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుఫున – 2569 ప‌రుగులు.

Leave a Reply