roads l తిరువూరులో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..

roads l తిరువూరులో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన..

తిరువూరు, ఆంధ్రప్రభః తిరువూరు పట్టణంలోని 19, 01, 03, 09, 11, 17, 18 వార్డుల్లో రూ.79,84,000/- వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. పట్టణ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. పాడైన రహదారుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు నాణ్యమైన సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సూచించారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. తిరువూరు పట్టణంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని, ప్రతి వార్డులో సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు

Leave a Reply