రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి..

రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి..

  • బిజ్వార్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి బీటీ రోడ్డు పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని బిజ్వార్ ఉపసర్పంచ్ గోవర్ధన్ రెడ్డి కోరారు. శుక్రవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధి లోని కొత్తపల్లి బీటీ రోడ్డు ప్రారంభం కావడంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా బిజ్వార్ నుండి కొత్తపల్లికి బీటీ రహదారి సౌకర్యం లేకపోవడంతో ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో బీటీ రహదారి పనులు కొనసాగుతున్నాయని పనులు వేగవంతంగా చేపట్టాలన్నారు. బీటీ రహదారి పనులు అధికారులు పరవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు ఎల్లప్ప, నాయకులు రాము, బాలప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply