Road | జనసేన నేత సహకారంతో…

Road | జనసేన నేత సహకారంతో…
- డొంక రోడ్డు చదును పనులు ప్రారంభం..!
Road | కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు మండల పరిధిలోని నరసింహపురం- నారే పాలెం డొంక రోడ్డు పూర్తి అధ్వాన్నంగా ఉండడంతో రోడ్డుపై ప్రయాణించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై బడేవారి పాలెం జనసేన పార్టీ నాయకులు బడే వీర వెంకటరావు స్పందించి జేసీపీ సహాయంతో దాదాపు రెండున్నర కిలోమీటర్లకు పైగా డొంక రోడ్డు(Detour) చదును పనులను ప్రారంభించారు.
రహదారి సమస్యపై స్పందించి చదును పనులు జనసేన నాయకులు(Jana Sena leaders) చేపట్టడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పూతబోయన సాయిబాబు, బడే వీరబాబు, ముద్దినేని చందర్రావు, కంచర్లపల్లి వెంకటరమణతో పాటు స్థానిక రైతులు పాల్గొన్నారు.
