MDK | నిజాంపేటలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఓ వాహ‌నం బోల్తా పడి ఒక వ్యక్తి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండల శివారులోని చిరుకవాగు వద్ద శుక్రవారం జరిగింది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 765 డీజీ రోడ్డు పనులకు సంబంధించిన వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడడంతో బీహార్‌కు చెందిన కార్మికుడు మృతిచెందాడు.

ఈ వాహనంలో మరో 8మంది కూలీలకు తీవ్రగాయాలు కావడంతో స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *