Road Accident |బావిలో పడ్డ కారు : ముగ్గురు దుర్మరణం

పీలేరు: అన్నమయ్య జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకున్నది. పీలేరు మండలం బాలమువారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదానికి గురైన కారు కర్ణాటక రిజిస్ట్రేషన్‌తో ఉండటంతో బాధితులు అదే రాష్ట్రానికి చెందినవారిగా భావిస్తున్నారు. ఈ సఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది

Leave a Reply