Road accident | తుంగతుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం

Road accident | తుంగతుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం
- పలువురికి గాయాలు
- ఒకరు మృతి
Road accident | సూర్యాపేట, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అరవపల్లి సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్గొండ నుంచి పాఠశాలలకు వెళ్తున్న ఉపాధ్యాయుల కారు అదుపుతప్పి రోడ్డు పక్కన పల్టీలు కొట్టి పడిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు ఉపాధ్యాయులు ప్రయాణిస్తుండగా, అందులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారిలో ఉపాధ్యాయురాలు కల్పన ఘటనాస్థలంలోనే మృతి చెందారు.

ఇద్దరు హెడ్మాస్టర్లు రావులపల్లి పోరెడ్డి గీత, తులసిలకు తీవ్ర గాయాలు కాగా.. మిగతా ఉపాధ్యాయులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎమ్ టీలు నిరంజన్, క్రాంతి, పైలట్లు సంతోష్, శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు.
