Road accident | ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి

Road accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురిలోని పెట్రోల్ బంక్ ఎదురుగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించిన లారీ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న మాదాసు అమరనాథ్ (17), పడాల రిశ్వంత్ (17), కోల మయాంక్ (16) అనే ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. అదే వేగంతో లారీ పక్కనే వెళ్తున్న ఆటోను కూడా ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న హనుమాన్ భక్తులకు గాయాలయ్యాయి. మొత్తం తొమ్మిది మందికి గాయాలు కాగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్ సాయంతో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply