అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు…

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు…

  • ఖిలావరంగల్ తూర్పు కోటలో ప్రజల ఆగ్రహం
  • హనుమాన్ గుడి జంక్షన్ నుంచి కోట వరకు రోడ్ దుస్థితి
  • గుంతలపై పూలు జల్లి బీజేపీ నిరసన
  • అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆవేదన

ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : ఖిలావరంగల్ తూర్పు కోట ప్రాంతంలో రహదారి పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. కేవలం అర కిలోమీటర్ దూరంలోనే అరవైకి పైగా గుంతలు ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హనుమాన్ గుడి జంక్షన్ నుంచి కోట వరకు వెళ్లే ఈ రహదారి ప్రస్తుతం నిత్య నరకయాతనగా మారింది. ప్రతిరోజూ ఈ రోడ్డు పై ప్రయాణించే స్కూల్ పిల్లలు, వృద్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేయడానికే భయపడే పరిస్థితి నెలకొంది. వర్షం పడితే గుంతలు నీటితో నిండిపోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

ఈ సమస్యపై సోమవారం గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్‌ లో బీజేపీ నాయకులు స్థానికులతో కలిసి నిరసన చేపట్టారు. గుంతలపై పూలు జల్లుతూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రెండు సంవత్సరాల క్రితం ఈ రోడ్డుకు శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పాల్గొని అధికారుల నిర్లక్ష్యం పై తీవ్రంగా మండిపడ్డారు.

రోడ్లు ఇలా ఉంటే ప్రజలు ఎలా జీవిస్తారు? అభివృద్ధి ఎక్కడ? అని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే సమస్యను విస్తరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల మహేష్, ఖిలావరంగల్ మండల పార్టీ ఉపాధ్యక్షులు నాండ్రే అమర్ నాథ్, మండల ప్రధాన కార్యదర్శి గొల్ల రాజ్ కుమార్, ఓబిసి మోర్చా అధ్యక్షులు బొలుగొడ్డు సతీష్, యువ మోర్చా అధ్యక్షులు గట్టికొప్పుల వంశీ, బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జి సంగరబోయిన రంజిత్, బిజెపి బూత్ కో-ఆర్డినేటర్ ముడిదే రఘునాథ్, బూత్ అధ్యక్షులు బోళ్ల కిరణ్, దేవర కమలాకర్, బోలుగొడ్డు అమృత్, రంజిత్, మైదం రాజు, గన్నారపు రవి, సీనియర్ బిజెపి నాయకులు పెసరు కుమార్, చింతం రమేష్, బిల్ల కిషోర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు బేర నరేందర్, బొమ్మిడి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply