Rising Global Summit | రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
- సిఎం చంద్రబాబును కలసిన బీర్ల
- శ్రీ లక్ష్మి నరసింహా స్వామి దర్శించుకోవాలని కోరిన ఐలయ్య
- మంత్రి కోమటిరెడ్డి, ప్రభుత్వ విఫ్ బీర్ల
Rising Global Summit | యాదాద్రి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chief Minister Nara Chandrababu Naidu) ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ(Cinematography) శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విప్ ,డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు.


డిసెంబర్ 8, 9 న హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025(Rising Global Summit)కు తెలంగాణ రాష్ట్రం తరఫున అధికారిక ఆహ్వానం అందజేశారు. దావోస్ ఆర్థిక ఫోరం నమూనాలో నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రపంచ, జాతీయ స్థాయి పరిశ్రమల నేతలు, వ్యాపార సంస్థలు, ఆర్థిక నిపుణులు, విధాన రూపకర్తలు పాల్గొననున్నట్లు ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబుకు వివరించారు.
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా బీర్ల ఐలయ్య కోరగా జనవరిలో లక్ష్మీ నరసింహస్వామి(Lakshmi Narasimhaswamy) వారిని దర్శించుకుంటానని తెలిపారు.

