వరంగల్ |ప్రముఖ కళాకారుడు,బలగం సినిమా నటుడు జీవీ బాబు కన్నుమూశారు. గత కొంత కాలం నుంచి జీవీ బాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో వరంగల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. జీవీ బాబు మృతి పట్ల డైరెక్టర్ వేణు సంతాపం తెలిపారు.బాబు మొత్తం జీవితం నాటకరంగంలోనే గడిపారు. ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం తనకు దక్కిందని వేణు అన్నారు.
RIP | బలగం నటుడు జీవీ బాబు కన్నుమూత
