AP | పారదర్శకంగా ఉండాలి

AP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా రెవెన్యూ పరిపాలనను మరింత చురుకుగా, పారదర్శకంగా మార్చేందుకు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి (Dr. A. Siri) గురువారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి విస్తృత స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు, మండల తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.

రెవెన్యూ విభాగ పనితీరు, భూసర్వే కార్యక్రమాల పురోగతి, వివాదాస్పద భూముల పరిష్కారం, ఫిర్యాదుల పరిశీలన వంటి అంశాలపై కలెక్టర్ (Collector) సమీక్షించారు. భూసంబంధిత రికార్డులు సమయానికి అప్‌డేట్ చేయాలని, ప్రజా సేవలు ఆలస్యమవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. భూ వివాదాలు, ఎఫ్‌ఎఎంట్రీలు, పంట పొలాల సర్వే, రికార్డుల డిజిటలైజేషన్‌ అంశాలను వివరంగా సమీక్షించారు.

భూమిపైన జరుగుతున్న ప్రతి లావాదేవీ స్పష్టంగా నమోదు కావాలని, ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వొద్దని కలెక్టర్ హెచ్చరించారు. సర్వేయర్లు ప్రదేశ స్థాయిలో పనిచేసేటప్పుడు కచ్చితత్వం పాటించాలని, భూమి సరిహద్దుల కొలతల్లో పొరపాట్లు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని (Take precautions) సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ (Video conference) లో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్ కమర్‌, డిప్యూటీ కలెక్టర్‌ సి.వెంకట నారాయణమ్మ, రెవెన్యూ అధికారి బృందం పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా భూసంబంధిత సేవలు వేగవంతం చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రజలకు నేరుగా సంబంధించినది కాబట్టి ప్రతి అభ్యర్థనను సమయానికి పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ ప్రతిష్టను నిలబెట్టాలని కలెక్టర్ పేర్కొన్నారు.

Leave a Reply