స్థల సేకరణకు రెవెన్యూ కసరత్తు

స్థల సేకరణకు రెవెన్యూ కసరత్తు

  • ఎస్ పురంలో కలెక్టర్ పరిశీలన

చిత్తూరు, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన స్థలాన్నిఎస్ ఆర్ పురం(S R Puram) మండలంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్(District Collector Sumit Kumar) పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. త్వరలో జిల్లాలో పరిశ్రమల సెక్టార్లలో పారిశ్రామిక(Industrial) పార్కులు రాబోతున్నాయని తెలిపారు.

అందులో భాగంగా జీడి నెల్లూరు(Nellore) నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే(MLA) అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐఐసీ(APIIC) ద్వారా స్థల పరిశీలనకు సూచనలు జారీ చేసిందన్నారు.

ఎస్ ఆర్ పురం మండలం పాతపాలెం(Pathapalem), 56- కన్నికాపురం, జీఎంఆర్ పురం రెవెన్యూ గ్రామాలలో 1,000 ఎకరాల ప్రభుత్వ, డీ కే టీ, ప్రైవేట్ భూ సేకరణకు స్థలాన్నిపరిశీలించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రైతులతో చర్చించామని, మరిన్నిసార్లు పరిశీలిస్తామన్నారు. ఈ పర్యటనలో ఏపీఐఐసీజెడ్ ఎం. సుబ్బారావు, ఎస్ ఆర్ పురం తహశీల్దార్ లోకనాథ పిళ్ళై పాల్గొన్నారు.

Leave a Reply