రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026

రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026

రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలి
అధ్యక్షులు, ఏపీఆర్ఎస్ఏ కె. శ్రీరాములు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ : రెవెన్యూ ఉద్యోగులు క్రీడల పోటీల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎపిఆర్ఎస్ఏ అధ్యక్షులు కె. శ్రీరాములు గురువారం పిలుపునిచ్చారు. ఐకమత్యమే మహాబలం – రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసుల సంఘం, శ్రీకాకుళం జిల్లా శాఖ, జిల్లాలోని అందరు రెవెన్యూ ఉద్యోగులకు ఆఫీస్ సబోర్డినేట్ నుండి డెప్యూటీ కలెక్టర్ వరకు,అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, సర్వే ఉద్యోగులు, గణాంకాధికారులు, గ్రామ రెవెన్యూ అధికారులు, గ్రామ రెవెన్యూ సహాయకులు ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజుల పాటు జరిగే శ్రీకాకుళం జిల్లా రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలులో పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరారు.

దాదాపు ఎనిమిది సంవత్సరాల (2018 నుండి ఇప్పటి వరకు) తరువాత, ఈ సంవత్సరం 2026లో ఈ కార్యక్రమం, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్,, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రోజువారి విధుల్లో రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిడి నుండి కొంత మేర ఉపశమనం కలిగించేందుకు దోహద పడతాయనే సదుద్దేశంతో ఉద్యోగుల్లో నైతిక స్థైర్యం, ఆత్మస్థైర్యం, మానసిక ఉల్లాసం, ఉద్యోగుల ఐక్యత పెంపొందించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.

శుక్రవారం ఉదయం 7 గంటలకు స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియం వద్దకు చేరుకోవాలని కోరుతూ, జిల్లా రెవిన్యూ క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలియజేస్తూ, ఉద్యోగులందరికీ ఈ మూడు దినములలో భోజన సదుపాయాలు కల్పించడం జరిగినదని తెలుపుతూ, ఆఖరి రోజు ఆదివారం సాయంత్రం 4 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. రెవిన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున హాజరై ఈ రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను పండగలా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసుల సంఘం తెలిపింది.

Leave a Reply