Crime | కాటారంలో ప్ర‌తీకారం.. మహిళపై గొడ్డలితో యువకుడి దాడి

కాటారం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం హైటెక్ పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. ఐదు గుంటల భూమి కోసం హత్యకు గురైన వ్యక్తి కుమారుడు మరుపాక అంజి నిందితురాలైన లచ్చక్కపై గొడ్డలితో దాడి చేసిన సంఘటన మంగళవారం పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగింది. కాటారం మండలం దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక లచ్చక్క (42) అనే మహిళ మారుపాక సారయ్యను హత్య చేసిన కేసులో అరెస్ట్ కాగా, గత కొన్ని రోజుల క్రితం కండిషన్ బెయిల్ పై విడుదలైంది.

ప్రతి మంగళవారం కాటారం పోలీస్ స్టేషన్ కు వచ్చి హాజరు కావాల్సి ఉండగా, మంగళవారం పోలీస్ స్టేషన్ కి వచ్చింది. తన తండ్రి సారయ్యను గత సంవత్సరం డిసెంబర్ 14న దేవరాంపల్లి గ్రామంలో లచ్చక్క మరో ముగ్గురుతో కలిసి దారణంగా హత్య చేశారు. దానికి ప్రతీకారంగా అంజి పగ తీర్చుకునేందుకు పథకం ప్రకారం రప్పించి పోలీస్ స్టేషన్ ముందే చంపి లొంగి పోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. లచ్చక్క పై దాడి చేస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు అడ్డగించి ఆపడంతో గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. లచ్చక పరిస్థితి విషమంగా ఉండడంతో భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply