Revanth Reddy | ఎక‌న‌మిక్ ఫోర‌మ్ వార్షిక స‌ద‌స్సు-2026

Revanth Reddy | ఎక‌న‌మిక్ ఫోర‌మ్ వార్షిక స‌ద‌స్సు-2026

Revanth Reddy | ఆంధ్ర‌ప్ర‌భ, వెబ్‌డెస్క్ : స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్, ఇతర అధికారుల‌తో భేటీ అయ్యేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి బ‌య‌లుదేరారు. ఎకనమిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సు–2026లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నగరానికి చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రతినిధి బృందానికి జ్యూరిచ్ విమానాశ్రయంలో ప్రవాస తెలంగాణ వాసులు ఘన స్వాగతం పలికారు. స్విట్జర్లాండ్‌లోని భారత రాయబారి మృదుల్ కుమార్, ఇతర అధికారులు జ్యురిచ్ ఎయిర్ పోర్టులో ముఖ్యమంత్రికి ఆత్మీయ స్వాగతం పలికి, మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Revanth Reddy

దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా దావోస్‌కు చేరుకున్నారు. దావోస్‌లో నాలుగు రోజుల పాటు జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధి బృందం పాల్గొననుంది. సమావేశాల తొలి రోజున వివిధ రంగాలకు చెందిన అంతర్జాతీయ కంపెనీల పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ 2047’ రోడ్‌మ్యాప్‌ను ప్రపంచ వేదికపై పరిచయం చేయనున్నారు.

Revanth Reddy

రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి లక్ష్యాలు, ప్రభుత్వ విధానాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని వివరించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. డిసెంబర్‌లో ప్రభుత్వం ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో ప్రతిపాదించిన అభివృద్ధి నమూనాకు అనుగుణంగా సుస్థిర పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ WEF–2026లో తన అజెండాను ముందుకు తీసుకెళ్లనుంది.

Revanth Reddy
Revanth Reddy

CLICK HERE TO READ యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ

CLICK HERE TO READ MORE

Leave a Reply