LETTER | అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

LETTER | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 2వ వార్డు అభివృద్ధి పనుల కోసం ప్రత్యేకంగా రూ.75 లక్షల నిధులు కేటాయించాలని కోరుతూ 2వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ షేక్ అప్సర్ ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ను కలిసి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

ఈ సందర్భంగా ఒక్కొక్కటి రూ.5 లక్షల అంచనా వ్యయంతో మొత్తం 15 సీసీ రోడ్డులతో పాటు, డ్రైనేజీ పనులకు సంబంధించిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఎమ్మెల్యే ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించినట్లు కౌన్సిలర్ తెలిపారు

Leave a Reply