TG | సీఎం రేవంత్ ను కలిసిన మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధులు..
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు చొరవ చూపినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరం ప్రతినిధులు ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
జస్టిస్ షమీమ్ అక్తర్ గారి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించడమే కాకుండా కమిషన్ నివేదికను కేబినేట్, శాసనసభలో ఆమోదింపజేయడాన్ని ప్రస్తావిస్తూ ఫోరం ప్రతినిధులు, మేధావులు ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేశారు.
ముఖ్యమంత్రిని కలిసిన ప్రతినిధి బృందంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొ.ఇటిక్యాల పురుషోత్తం, ఓయూ వైఎస్ చాన్సలర్ ప్రొ.ఎం.కుమార్, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొ. సి. కాశీం, ప్రొ. గడ్డం మల్లేశం, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ సభ్యుడు డాక్టర్ చారకొండ వెంకటేష్, తెలంగాణ వర్సిటీ ప్రొ. నండ్రు మోహన్ బాబు, మహాత్మా గాంధీ వర్సిటీ ప్రొ. మద్దిలేటి మధు, ప్రొ. మేడి శ్రీను, ప్రొ. కొర్రెముల శ్రీనివాస్ తో పాటు పలువురు ఇతర ప్రముఖులు ఉన్నారు.