రెపోరేటు యథాతథం
ద్రవ్యోల్బణం తగ్గుతోంది
లోన్లు..ఈఎంఐలు మామూలే
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా
( ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్) : విదేశీ పెట్టుబడులపై గంపెడాశలు పెట్టుకున్న షేర్ మార్కెట్ కు నిరాశ తప్పలేదు. రుణాలపై వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్డీఐ ప్రకటించింది. ఢిల్లీలో గత మూడు రోజులుగా ఆర్డీబ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన 2026 ఆర్థిక సంవత్సరం మానిటరీ పాలసీ కమిటీ భేటీ జరిగింది. MPC నాల్గవ ద్వైమాసిక సమావేశం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు జరిగింది. ఈ భేటీలో తీసుకున్న పలు నిర్ణయాలను బుధవారం ప్రకటించారు.
వృద్ధి , ద్రవ్యోల్బణం మధ్య సమతుల్యతను దృష్టిలో పెట్టుకుని మానిటరీ పాలసీ నిర్ణయాలను “న్యూట్రల్”గా ఉంచారు. రెపో రేటు: 5,5 % గానే కొనసాగిస్తారు. – రివర్స్ రెపో రేటు: 3.35% లో మార్పు లేదు). మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు: 5.75%. బ్యాంక్ రేటు: 5.50% కూడా మార్చలేదు. క్యాష్ రిజర్వ్ రేషియో (CRR)లోనూ మార్పు లేదు, ది జూన్ 2025లో 100 బేసిస్ పాయింట్లు తగ్గించిన విషయం విధితమే.
జీడీపీ వృద్ధి (GDP Growth) FY26కి 6.8%గా పెంచారు (మునుపటి అంచనా 6.5%). ప్రభుత్వ ఖర్చులు, ఆర్థిక కార్యకలాపాల ఆధారంగా ఈ నిర్ణయం శుభసూచకం. ఆహార ధరలు తగ్గడం, గ్లోబల్ కమోడిటీలు మెరుగుపడటంతో ద్రవ్యోల్బణం (Inflation – CPI) FY26కి 3.1%గా అంచనా వేశారు. (ఆగస్ట్‌లో 3.7% నుంచి తగ్గించారు). – 2025 ప్రారంభంలో (ఫిబ్రవరి నుంచి) RBI మొత్తం 100 బేసిస్ పాయింట్లు (25 bps x 3 + 50 bps in జూన్) రెపో రేటు తగ్గించింది, దీనివల్ల రుణాలు (లోన్లు) చౌకగా లభించాయి , వృద్ధిని ప్రోత్సహించాయి. ఈ భేటీలో రేటు కట్ ఆశలు ఉన్నప్పటికీ, అమెరికా టారిఫ్‌లు (50%), రూపాయి బలహీనత, జియోపాలిటికల్ రిస్కులు వల్ల రెపో రేటును యథాస్థితిలోనే ఉంచారు.
ఈ స్థితిలో హోమ్ లోన్, పర్సనల్ లోన్ EMIs మార్పు ఉండదు. ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు స్థిరంగా ఉంటాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు మంచిది. ఇక షేర్ మార్కెట్ ఆది స్థిరంగా నిలకడగా ఉండోచ్చు, లేదా స్వల్పంగా పడిపోవచ్చు, కానీ వృద్ధి అంచనాలు బ్యాంకింగ్, రియల్ ఎస్టేట్ వంటి సెక్టర్లకు సానుకూలం. ఈ నిర్ణయాలు ఆర్థిక వృద్ధిని సమర్థంగా పెంచటానికి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఉద్దేశించినవి.