నాడు రేణుక ఎల్లమ్మ.. నేడు రామలింగేశ్వర ఆల‌యంలో..

నాడు రేణుక ఎల్లమ్మ.. నేడు రామలింగేశ్వర ఆల‌యంలో..

నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట చెరువు కట్టపై ఉన్న రామలింగేశ్వరస్వామి ఆలయంలోని గంటను గుర్తు తెలియని దుండగులు దొంగలించారు. శుక్రవారం ఉదయం ఆలయానికి వెళ్లిన పూజారి గంట మాయమైన విషయాన్ని గమనించి ఆలయ కమిటీ సభ్యులకు తెలిపారు.

గతంలోనూ మహబూబాబాద్ రోడ్‌లో ఉన్న రేణుకా ఎల్లమ్మ గుడిలో కంచు గంటను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. సీసీ కెమెరాలు దొంగ కనబడినా పోలీసులు అత‌న్ని ప‌ట్టుకోలేక‌పోయార‌ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నర్సంపేట మండలంలోని అనేక గ్రామాలలో ఏర్పాటుచేసిన సోలార్ లైట్ల బ్యాటరీలను దొంగలు అపహ‌రించారు. ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్య‌పు తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Leave a Reply