మృతి చెందిన ఆవుదూడ తరలింపు…

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : మూగజీవి జీవచ్ఛవంలా పడి ఉంటే ఆ మూగ జీవిని జనావాసాల నుండి తరలించారు కౌన్సిలర్. పెద్దపల్లి పట్టణం 22వ వార్డు లక్ష్మీ గణపతి నగర్ లో ఆవుదూడ (మూగజీవి) ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. వార్డు ప్రజలు వెంటనే స్థానిక కౌన్సిలర్ ఉప్పు స్వరూప రాజుకు సమాచారం అందించారు.
తక్షణమే స్పందించిన కౌన్సిలర్ స్వరూప రాజు మూగజీవి మృతిపట్ల చలించి అక్కడినుండి తరలించేందుకు నిర్ణయించారు. మున్సిపల్ సిబ్బందితో మరణించిన ఆవుదూడను చెత్త టాక్టర్ లో అక్కడినుంచి పంపించి ఆ పరిసరాలను శుభ్రం చేయించారు.
జనావాసాల మధ్య మరణించిన ఆవుదూడ అలానే ఉంటే దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడేవారు. అలా కాకుండా తక్షణ చర్యలు చేపట్టడంతో దుర్వాసన నుండి ప్రజలు బయటపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన కౌన్సిలర్ స్వరూప రాజుకు వార్డు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
