Reddigudem | రూపురేఖలు మార్చడమే పల్లెపండుగ లక్ష్యం.

Reddigudem | రూపురేఖలు మార్చడమే పల్లెపండుగ లక్ష్యం.

  • మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు
  • కూనపరాజుపర్వలో రూ.46 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన.

Reddigudem | రెడ్డిగూడెం, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాల రూపురేఖలను మార్చే లక్ష్యంతో పల్లెపండుగ 2.0 కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని కూనపరాజుపర్వ గ్రామంలో రూ.46 లక్షల ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా నాణ్యతతో సిమెంట్ రహదారుల నిర్మాణం పూర్తి చేయాలని అన్నారు. గతంలో జరిగిన పల్లె పండుగ 1.0 విజయం స్ఫూర్తితో మరింత విస్తృతంగా అభివృద్ధి చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధితో సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా రూ.6కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ), ఎన్డీఏ కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply