ఆస్తి పన్ను చెల్లించని డిస్కవరీ కంపెనీ సామాను జప్తు

ఆస్తి పన్ను చెల్లించని డిస్కవరీ కంపెనీ సామాను జప్తు
ఆస్తిపన్ను చెల్లించని వారిపై చట్టపరమైన చర్యలు
మున్సిపల్ కమిషనర్ వెంకట్ రామిరెడ్డి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఆస్తి పన్నులు చెల్లించకుండా బకాయి పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరామిరెడ్డి తెలిపారు. మున్సిపాలిటీలోని డిస్కవరీ లాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు సందర్భంగా కంపెనీ గత రెండు సంవత్సరాలుగా రూ. 6,42,740 లు ఆస్తి పన్ను బకాయి పడటంతో సోమవారం మున్సిపల్ అధికారులు కంపెనీలోని ఫార్మేచర్ ను జప్తు చేసి తీసుకెళ్లారు.
పెండింగ్‌లో ఉన్న భారీ బకాయిల వసూలు కోసం గౌరవ మున్సిపల్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ కఠిన చర్యలు చేపట్టారు. గతంలోనే కంపెనీ యాజమాన్యానికి పలుమార్లు రెడ్ నోటీసులు, షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో చట్టపరమైన జప్తు చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు వివరించారు. నేడు ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో, మొండి బకాయిల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్ రామిరెడ్డి స్వయంగా పాల్గొని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. వీరితో పాటు మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, రెవెన్యూ ఆఫీసర్ అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, వార్డు ఆఫీసర్ సలీం, బిల్ కలెక్టర్ అంజయ్య, ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
