Real estate | కనుమరుగవుతున్న ప్రకృతి సంపద,

Real estate | కనుమరుగవుతున్న ప్రకృతి సంపద,
- గుట్టలను తోడేస్తున్న జెసీబీలు..
- పట్టా భూముల పేరుతో విలువైన మట్టి ,సహజ వనరులు మాయం..
- పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు..
Real estate | చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని శాంతినగర్, నవాబుపేట, శివారులోని గుట్టలు, నాడు దట్టమైన పచ్చని అడవితో పక్షుల కిలకిలలు, జంతువుల అరుపులతో, ప్రకృతి అందాలు, విలువైన సంపదలతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో అటుగా వెళ్లే ప్రజలకు కనువిందు చేసేది. దీంతో గత రెండు దశాబ్దాల క్రితం ఈ గుట్టలపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడింది. దీంతో ఆ భూములను తక్కువ ధరకే వందల ఎకరాల భూములు కొనుగోలు చేసి, విలువైన ఖనిజ సంపద ఐరన్ ఓవర్ తరలించి కాసుల వర్షం కురిపించుకున్నారు. కాగా మరికొందరు గత పది సంవత్సరాల క్రితం పట్టా భూముల పేరుతో నవాబుపేట శివారులోని గుట్టలను కొనుగోలు చేశారు.
దీంతో గుట్టలను భారీ యంత్రాలు జెసిబిల సహాయంతో గుట్టల్లో ఎర్ర మట్టిని తోడేస్తున్నారు. దీంతో ఆ మట్టిని గ్రీన్ ఫీల్డ్ కారిడార్ హైవే రోడ్డుకు ఎర్ర మట్టిని అమ్ముకొని రూ లక్షలాది రూపాయల కాసుల వర్షం కురిపించుకుంటున్నారు. ప్రకృతి సిద్ధమైన గుట్టలు, అడవులు, ఎర్రమట్టి ,ఐరన్ ఓవర్, తరలిస్తూ, ప్రకృతి సంపద కనుమరుగు చేస్తున్నారు. భవిష్యత్ తరాల్లో ప్రకృతి సంపద కనుమరుగు కావడంతో పర్యావరణానికి పెను ప్రమాదం పొంచి ఉందని, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు, ప్రభుత్వం, తగు చర్యలు తీసుకొని, ప్రకృతి సంపదలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
సహజ వనరులను దోచుకుంటున్న మట్టి మాఫియా…

చిట్యాల మండలంలోని నవాబుపేట శివారుకు సంబంధించిన టేకులబోడుగుట్టకు సంబంధించి కొంతమంది అక్రమంగా మట్టిని తరలిస్తు గుట్టనులూటి చేస్తున్న చూసి చూడనట్లుగా అధికారులు వ్యవహరించడంతో ఇష్టానుసారంగా వారి దందా కొనసాగుతుందని ఆరోపించారు. అక్రమార్కులు తీసుకున్న పర్మిషన్ కంటే ఎక్కువ మొత్తంలో మట్టిని తరలిస్తూ సహజ వనరులను దోచుకుంటున్నారని అన్నారు, ప్రభుత్వ అధికారులు,అక్రమ మట్టి తరలింపు విషయం తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సహజ వనరుల లూటీతో భవిష్యత్తులో, పర్యావరణం దెబ్బతింటుందన్నారు.

మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురవక పంటలు పండక మానవ జీవనానికి ప్రమాదం వాటిల్లుతుందని . టేకుల బోడు గుట్టను అక్రమంగా పట్టాలు చేయడం తగ దన్నారు. దాని పక్కన ఉన్న విస్తారంగా ఉన్న భూములపై సర్వే నిర్వహించి, ప్రభుత్వ భూములను కాపాడాలని, మట్టి అక్రమార్కుల దందాపై తక్షణమే చర్యలు చేపట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మల్లేష్ డిమాండ్ చేశారు.
