ఈరోజు రాజస్థాన్ తో జరుగుతున్న పోరులో.. ఆర్సీబీ భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ సారి సొంత మైదానంలో ఎలాగైనా గెలవాలనే కసితో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు నమోదు చేసింది.
కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఆర్సీబీకి.. ఆరంభం దక్కింది. ఓపెనర్లు చెలరేగడంతో భారీ స్కోర్ నమోదైంది. ఫిలిప్ సాల్ట్ (26) రాణించగా.. కోహ్లీ (42 బంతుల్లో 70), దేవదత్ పడిక్కల్ (27 బంతుల్లో 50) చరో అర్ధ శతకాలతో చెలరేగారు.
ఫిలిప్ సాల్ట్ – కోహ్లీ కలిసి తొలి వికెట్ కు 61 పరుగులు జోడించగా.. కోహ్లీ – పడిక్కల్ కలిసి రెండో వికెట్ కు 51 బంతుల్లో 95 పరుగుల భారీ పార్ట్‌నర్ షిఫ్ ఏర్పాటు చేశారు.
ఇక టిమ్ డేవిడ్ (15 బంతుల్లో 23), జితేష్ శర్మ (10 బంతుల్లో *20 నాటౌట్) ఆకట్టుకున్నారు.
ఆర్ఆర్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. ఆర్చర్, హసరంగ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. దాంతో 206 పురుగుల విజయలక్ష్యంతో రాజస్థాన్ రాయల్స్ ఛేజింగ్ ప్రారంభించనుంది.