షేర్ నష్టాలకు షాక్

  • ఈ వారం రూ.4.63 లక్షల కోట్లు లాభం
  • వచ్చే వారం పర్వాలేదు
  • నిఫ్టీ.. సెన్సెక్స్ కు నిలకడ ఛాన్స్

(ఆంధ్రప్రభ, బిజినెస్ డెస్క్) : గత 8 రోజులు నష్టాలతో అష్టకష్టాలతో తల్లడిల్లిన షేర్ మార్కెట్ ఆర్బీఐ టానిక్కుతో మళ్లీ పుంజుకుంది. ఆర్బీఐ రెపో రేట్ యథాతథం, గ్లోబల్ క్యూస్ ప్రభావంతో క్షీణత్వం వెంటాటడినా .. మెటల్స్, బ్యాంకింగ్, ఐటీ సెక్టర్లు వెనక్కి తగ్గలేదు. మొత్తం మీద మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ సినారియో ప్రదర్శించింది. స్టాక్ -స్పెసిఫిక్ ట్రేడింగ్ డామినేట్ చేసింది. ఫలితంగా షేర్ మార్కెట్ రూ.4.63 లక్షల లభాన్ని తన ఖాతాలో వేసుకుంది.

సెప్టెంబర్ 29న 24,634.90 పాయింట్లతో ముగిసిన నిఫ్టీ అక్టోబర్ 3 నాటికి 24,894.25 పాయింట్లకు చేరింది. అంటే 259.35 పాయింట్లు పెరిగాయి ఇక సెన్సెక్స్ 80,364.94 పాయింట్ల నుంచి 81,207.17కి ఎగబాకింది. ఇండెక్స్ లో 842.23 పాయింట్లు పెరిగాయి. సెప్టెంబర్ 29 , 30 తేదీల్లో -0.1% నష్టం వెంటాడితే.. అక్టోబర్ 1న 0.92% , అక్డోబరు 3న 0.23% లాభలతో తేరుకుంది. మెటల్స్ (+3-4%), పవర్ (+2-3%), బ్యాంకింగ్ (+1-2%) సెక్టర్లు బలంగా పుంజుకోగా .. ఐటీ, ఫార్మా రంగాలు కోలుకున్నాయి. ఇక ఆటో, కన్స్యూమర్ గూడ్స్ సెక్టర్లు -1-2% దెబ్బతిన్నాయి. గ్లోబల్ క్యూస్ వోలటాలిటీలోనూ – మెటల్స్ రాలీ సాగింది. ఇందులో Tata Steel 3.5%, పవర్ సెక్టార్ లో Power Grid Corporation 2.9% , బ్యాంకింగ్ రంగంలో Axis Bank 2.2% , Kotak Mahindra Bank +1.8%, ఇన్ ఫ్రా రంగంలో Larsen & Toubro (L&T) 1.5% లాభంతో ఖుషీ ఖుషీగా ఉన్నాయి.

గత వారం నష్టాల నుంచి IT సెక్టర్ లోని Wipro తేరుకుంది. 1.55% రికవరీ సాధించించింది. Axis Bank 2.2% , అంతర్జాతీయ ధరల మద్దతుతో – మెటల్స్ సెక్టర్‌లో Hindal corporation 1.8 % -, జ్యువెలరీ సెక్టర్ లో Titan 1.2% రికవరీ సాధించాయి. ఇక Coal India -1.3%, Tech Mahindra -1.3% . Maruti Suzuki -1.2% , Max Health care -1.0% , Dr. Reddy’s Labs* -0.8% నష్టాలను మూట గట్టుకున్నాయి.

మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ లో ఇండియన్ మార్కెట్ నష్టపోలేదు. అదనంగా రూ.4.63 లక్షల కోట్ల లాభం సాధించింది. సెప్టెంబర్ 26 సమాచారం మేరకు రూ. 450.55 లక్షల కోట్ల నుంచి అక్టోబర్ 3 వరకూ రూ. 455.18 లక్షల కోట్ల పెట్టుబడిని సాధించింది. అంటే రూ. 3.63 లక్షల కోట్లు పెరిగింది. ఏతా వాతా లాభాలతో షేర్ మార్కెట్ దసరా సందడి చేసినట్టే.

ఇది సరే.. అక్టోబర్ 6 నుంచి -10 వరకూ అనుకూల అంశాలను విశ్లేషిస్తే.. 24,200 నుంచి 25,000 రేంజ్‌లో నిఫ్టీ ట్రేడ్ అవ్వొచ్చు 24,600 పాయింట్లకు చేరే అవకాశం ఉంది. లేదో 25,100 పాయింట్లతో ప్రతిఘటించవచ్చు. సెన్సెక్స్ 81,000 నుంచి 82,000 పాయింట్ల మధ్య నిలకడగా ఉండొచ్చు. అమెరికా జాబ్స్ రిపోర్ట్, ఇండియా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా, పారిన్ ఇన్వెస్టిమెంట్స్ ఇన్‌ఫ్లో. స్టాక్ -స్పెసిఫిక్ ట్రేడింగ్ కంటిన్యూ, మెటల్స్ బ్యాంక్స్ బలంగా ఉండవచ్చు. గ్లోబల్ టెన్షన్స్ తో వోలటాలిటీ పెరిగే చాన్స్ ఉంది. ఇదే పెద్ద సమస్య. ఇండియన్ షేర్ మార్కెట్‌లో విదేశీ పెట్టుబడులు (FII) ఉపసంహారణ: కారణాలు, మొత్తం పునరుద్ధరణ చర్యలు.

2025లో ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో విదేశీ మదుపర్లు భారీగా షేర్లు అమ్మేస్తున్నారు. ఇది మార్కెట్ లో పెట్టుబడిని ఆవిరవుతోంది. అందుకే సెన్సెక్స్ –నిఫ్టీలపై ఒత్తిడికి పెరిగింది. ఈ స్థితిలో దేశీయ మదుపర్ల కొనుగోళ్లు పెంచి మద్దతు ఇస్తున్నారు. అసలు విదేశీ పెట్టుబడిదారులు ఎందుకు జావగారుతున్నారు? భారత్‌ కు ప్రత్యామ్నంగా చైనా, తైవాన్, సౌత్ కొరియా దేశాలకు ఎందుకు మళ్లుతున్నారు. హై వాల్యుయేషన్స్ వల్లనే ప్రపంచ సగటు కంటే భారతీయ స్టాకుల ఖరీదు విలువ అత్యధికం. కొనుగోలు, ఆదాయం నిష్పత్తి 22 : -25 కావటంతో మరింత ఆకర్షణీయ వెళ్తున్నారు. కార్పొరేట్ సంస్థల త్రైమాసిక లాభాలు తక్కువగా పోస్ట్ అవుతున్నాయి. ఇక బ్యాంకుల్లో క్రెడిట్ డిమాండ్ తగ్టింది. క్రెడిట్ కాస్ట్ పెరిగింది.

దీనికి తోడు ప్రపంచ దేశాల్లో అనిశ్చితి పరిస్థితులు అమెరికా -భారత్ ట్రేడ్ డిల్‌లో జాప్యం జరగటం, 50% వరకు అమెరికా దిగుమతుల సుంకాన్ని పెంచడం, రష్యా- ఉక్రెయిన్ మధ్య టెన్షన్స్ తో క్యాపిటల్ ఫ్లైట్ కూడా జరుగుతోంది. ఇక అమెరికా డాలర్ బలం, ఫెడ్ రేట్ పాలసీలు కూడా ప్రభావం చూపిస్తుంటే.. చైనా స్టిమ్యులస్ ప్యాకేజీలు, తైవాన్ సెమీ కండక్టర్ బూమ్ తో విదేశీ మదుపరులు దారి మళ్లుతున్నారు. ఈ కారణంగానే ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు రూ. 2.40 లక్షల కోట్లు భారతీయ మార్కెట్ నుంచి వెళ్లిపోయాయి.

Leave a Reply