Rbi l ఆర్బిఐ ఆధ్వర్యంలో… నేటి నుంచి నుంచి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం…!!

Rbi l ఆర్బిఐ ఆధ్వర్యంలో… నేటి నుంచి నుంచి 13 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం…!!
Rbi l పల్నాడు, ఆంధ్రప్రభ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 9 నుండి 13 వరకు నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా, ప్రజల్లో ఆర్థిక అవగాహన పెంపొందించేందుకు రూపొందించిన పోస్టర్లను జాయింట్ కలెక్టర్ సంజనా సింహా, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ (ఎల్ డి ఎం) కె.ఎస్. రాంప్రసాద్, డీఆర్డిఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఝాన్సీరాణి ఆవిష్కరించారు. ప్రజలు సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్థిక అక్షరాస్యత ఎంతో కీలకమని, సురక్షిత బ్యాంకింగ్ విధానాలు, డిజిటల్ లావాదేవీలు, పొదుపు అలవాట్లు, ఆర్థిక మోసాల నుంచి రక్షణపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ఈ వారోత్సవం ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు బాధ్యతాయుత ఆర్థిక ప్రవర్తనపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వారు చెప్పారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవం సందర్భంగా బ్యాంకింగ్ సేవలు, బీమా, పెన్షన్ పథకాలు మరియు డిజిటల్ ఆర్థిక భద్రతపై వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.
వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలి….!!
జెసి పిలుపు…!
వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనలో ప్రతీ ఒక్కరూ భాగస్వామ్యం కావాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన సింహా పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వెట్టి చాకిరి వ్యవస్థ (బాండెడ్ లేబర్) నిర్మూలన దినోత్సవం పై కార్మిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలన కావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ…. వెట్టి చాకిరి వ్యవస్థ నిర్మూలనలో అందరూ భాగస్వామ్యం కావాలని, సమష్టి కృషితో సమసమాజం సాధ్యం అవుతుందన్నారు. వెట్టి చాకిరి వ్యవస్థ ఒక సామాజిక దురాచారమన్నారు. భారత రాజ్యాంగం ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, గౌరవప్రద జీవనంకు అవకాశం కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఎస్.కె మహబూబ్ సుభాని, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఉమా దేవి, కార్మిక శాఖ అధికారులు, నీడ్స్, డిబిఆర్సి, వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
