R&B Road | ఎమ్మెల్యే శంకుస్థాపన..

R&B Road | ఎమ్మెల్యే శంకుస్థాపన..
R&B Road | పెదపారుపూడి, ఆంధ్రప్రభ : పెదపారుపూడి మండలంలో ఆర్ అండ్ బీ రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శుక్రవారం ఘనంగా శంకుస్థాపన చేశారు. పెదపారుపూడి నుంచి ముదునూరు మీదుగా కాటూరు వరకు సాగే ఈ రహదారి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో రహదారుల నిర్వహణను పూర్తిగా విస్మరించారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం నిబద్ధతతో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
