రేషన్ బియ్యం పట్టివేత.. ఎన్ని క్వింటాళ్లు అంటే..

రేషన్ బియ్యం పట్టివేత.. ఎన్ని క్వింటాళ్లు అంటే..

గంపలగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని దుందిరాలపాడు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన 150 క్వింటాళ్ళ ప్రజాపంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యాన్ని మంగళవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తునికిపాడు గ్రామానికి చెందిన కొమ్మినేని వెంకటేశ్వరరావు గ్రామాల్లో తక్కువ ధరకు వారి వ్యక్తుల నుండి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఆ బియ్యాన్ని ఫారాల్లోని కోళ్లకు మేతగా వినియోగించుకునుటకు పొలంలో నిల్వ చేశారు.

సమాచారం అందుకున్న తహసీల్దార్ వి.రాజాకుమారి స్థానిక ఎస్సై జి.అనిల్,పిడిఎస్ డిప్యూటీ తహసీల్దార్ శివ నాగరాజుతో కలిసి అక్రమంగా నిల్వ చేసిన పొలం వద్ద తనిఖీ చేశారు. మొత్తం 300 బస్తాల్లో ఉన్న 150 క్వింటాళ్ళ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగిందని తహసీల్దార్ తెలిపారు. వెంకటేశ్వరరావు పై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించినా,అక్రమ నిల్వలు చేసినా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

Leave a Reply