Ration rice | 90 క్వింటాల్ రేషన్ బియ్యం పట్టివేత..

Ration rice | 90 క్వింటాల్ రేషన్ బియ్యం పట్టివేత..
- ముగ్గురుపై కేసు నమోదు
Ration rice | టేకుమట్ల, ఆంధ్రప్రభ : అక్రమంగా 90 క్వింటానుల రేషన్ బియ్యం(Ration rice) తరలిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లి గ్రామం నుండి కాల్వ శ్రీరాంపూర్ వెళ్ళు మార్గంలో మానేరు వద్ద మూడు వాహనాల్లో 90 క్వింటాల పిడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రాజు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వివరాలలోకి వెళ్తే గోరి కొత్తపల్లి మండలం విజయపల్లికి చెందిన బొమ్మల శ్రీధర్, జక్కుల శ్రీకాంత్, రేగొండ మండలం కోటంచ గ్రామానికి చెందిన కట్ల శ్రీనివాస్ ఈ ముగ్గురు కలిసి రేగొండ గోరు కొత్తపల్లి మండలాల్లో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంను తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు అమ్మి లాభాలు ఆశిస్తున్నారు.
చిన్నచిన్న గ్రామాల మీదుగా కాల్వ శ్రీరాంపూర్, మంతిని చెన్నూరు మీదుగా వాహనాలను తీసుకెళ్తున్న క్రమంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు పట్టుకొని ఆ మూడు వాహనాలు, ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసుకొని బియ్యం స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సివిల్ సప్లై డిపార్ట్మెంట్ వారు మాట్లాడుతూ… ప్రభుత్వం నిరుపేదలకు ఉచితంగా సరపర చేస్తున్న రేషన్ బియ్యాన్ని ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
