రెన్యువల్స్ గురించి భయపడొద్దు..

రెన్యువల్స్ గురించి భయపడొద్దు..

డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ శ్రీవాస్ నూపూర్ అజయ్ కుమార్

విజయవాడ, ఆంధ్రప్రభ : గత ఏడాది ఆథరైజేషన్ రెన్యువల్ విషయంలో జి ఎస్ డబ్ల్యూ ఎస్ వెబ్సైట్లో వచ్చిన ఎర్రర్ ను త్వరలో సరి చేస్తామని ఈ విషయంలో డీలర్లు ఎవరు భయపడాల్సిన పనిలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్ నుపూర్ అజయ్ కుమార్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ముత్యాల శేషగిరిరావు కార్యనిర్వాహక అధ్యక్షుడు శివప్రసాద్ సోమవారం రాష్ట్ర కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం ఇచ్చారు.

2025 మార్చిలో రెండు సంవత్సరాలకి ఫీజు చెల్లించి సచివాలయంలో రెన్యువల్ కోసం దరఖాస్తు చేసిన వారిలో రాష్ట్రంలో 80 శాతం మంది డీలర్లకు 2027 వరకు రావలసిన అప్రూవల్ 2027 వరకే వచ్చిందని వినతి పత్రంలో పేర్కొన్నారు. వీరందరికీ మరల 2027 వరకు ఆర్థరైజేషన్ రెన్యువల్స్ రీప్రింట్ ఇచ్చేలాగా ఆదేశాలు ఇప్పించాలని కోరారు. సమస్య తన దృష్టిలో ఉందని త్వరలో దానికి పరిష్కారం లభిస్తుందని తెలియజేశారు. అదేవిధంగా గత కొద్ది రోజులుగా ఎంఎల్ఎస్ పాయింట్లు డిస్పాచ్ అయిన తర్వాత డీలర్ కు స్టాక్ ఇచ్చే వేయింగ్ స్కేల్ వద్ద వెయిట్ లేకుండానే ఈపాస్ లో వచ్చేస్తుందని, ఇది అవకాశం తీసుకొని చాలా ఎమ్మెల్యేస్ పాయింట్లు స్టాకు తుకం లేకుండా డీలర్కి ఇచ్చేస్తున్నారు అని తెలియజేశారు.

డీలర్ స్టాకు రిసీవ్ చేసుకున్న దగ్గర కూడా డిస్పాచ్ లో వచ్చేస్తుందని ఈ సమస్యని పరిష్కరించాల్సిందిగా కోరారు. ఈపాస్ లో కొత్త వెర్షన్ 3.2 లో సరుకుల కోసం కార్డుదారులు వేలు ముద్ర వేయగానే పంచదార గోధుమపిండి ముందుగానే డేటా బేస్ లో వచ్చేస్తుందని బియ్యం మాత్రమే డీలరు ఎంటర్ చేయాల్సి వస్తుందని దీనివల్ల కార్డుదారుడికి పంచదార గోధుమపిండి అవసరం లేకపోయినా కూడా బిల్లు రావటం వల్ల ఆన్లైన్లో స్టాక్ కార్డుదారులకు ఇచ్చినట్టుగా కనబడుతుందని, కానీ ఆ స్టాక్ డీలర్ వద్ద ఉంటుందని అధికారులు తనిఖీ కొచ్చినప్పుడు డీలరు మీద కేసు నమోదు చేస్తారని ఈ ఇబ్బందులు సరి చేయమని కోరడం జరిగింది. ఈ రెండు సమస్యలను ఎన్ ఐ సి తో మాట్లాడి సరి చేపిస్తామని ఆవిడ హామీ ఇచ్చారు.

Leave a Reply