ఒకే రోజులో రేషన్ కార్డును మంజూరు..

ఒకే రోజులో రేషన్ కార్డును మంజూరు..

  • ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కొత్తూరు, ఆంధ్రప్రభ : మహిళకు రేషన్ కార్డ్ మంజూరు చేస్తానని మాటిచ్చి రెండు రోజుల్లో రేషన్ కార్డు మంజూరు చేయించి, రేషన్ బియ్యం ఇప్పించిన ఘనత షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు దక్కింది. రెండు రోజుల క్రితం కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను అదే గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన వరలక్ష్మి రేషన్ కార్డ్ కోసం ఎమ్మెల్యేను కోరింది.

స్పందించిన ఎమ్మెల్యే ఒక్కరోజులోనే మహిళకు రేషన్ కార్డు మంజూరు చేయటంతో పాటు రేషన్ బియ్యాన్ని సైతం పంపిణీ చేశారు. రేషన్ కార్డు ఇప్పిస్తానని మహిళకు మాట ఇచ్చిన ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం రేషన్ కార్డు ఇప్పించారు. రేషన్ కార్డు అందజేసి సన్న బియ్యం అందించిన ఎమ్మెల్యేకు వరలక్ష్మి కృతజ్ఞతలు తెలియజేశారు.

బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో నిరుపేదలను పట్టించుకున్న పాపాన పోలేదని, ఏ ఒక్కరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, దోచుకొని దాచుకోవడమే పనిగా పెట్టుకున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని విడతలవారిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply